News February 2, 2025
కాంగ్రెస్‌లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.
Similar News
News November 6, 2025
హుజూరాబాద్ ప్రజలతో 25 ఏళ్ల అనుబంధం ఉంది: ఈటల

హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్‌లో గురువారం బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొస్తానని, ఇక్కడి ప్రజలతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని పేర్కొన్నారు.
News November 6, 2025
ఉండ్రాజవరం: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో దువ్వాపు జయరాం (25) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News November 6, 2025
బెదిరింపు కాల్స్ వస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ శబరిశ్

సైబర్ మోసగాళ్ల నుంచి వచ్చే బెదిరింపు కాల్స్, డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఎస్పీ శబరిశ్ సూచించారు. ఇటీవల ములుగులోని ఓ మెడికల్ షాపు యజమానికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, తాము డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌లమని బెదిరించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అనుమానిత వ్యక్తుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఎవరికైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.


