News February 2, 2025

నేటి నుంచే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు

image

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 9వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు భక్తులకు వసతులు, ఆలయానికి రంగులు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతిలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాట్ల పనులలో నిమగ్నమై ఉన్నారు. ఈసారి జాతరకు సుమారుగా 12 లక్షల వరకు భక్తులు రావచ్చని అంచనా వేశారు.

Similar News

News November 15, 2025

అరకులో డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపల్

image

అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సర డిగ్రీ కోర్సులో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.చలపతిరావు శనివారం తెలిపారు. బి.ఏ పొలిటికల్ సైన్స్ -28, బి.ఏ హిస్టరీ-16, బి.కాం(జనరల్)-46, బి.కాం(సీఏ)-9, బి.ఎస్సీ(మేథ్స్)-19, బి.ఎస్సీ(ఫిజిక్స్)-10 సీట్లు ఉన్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు. ఆసక్తిగల విద్యార్థినులు అర్హత ధ్రువపత్రాలతో కళశాల ఆఫీసు నందు హజరుకావాలన్నారు.

News November 15, 2025

విజయనగరంలో యాక్సిడెంట్.. వెయిట్‌లిఫ్టర్ మృతి

image

విజయనగరంలోని YSR నగర్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెయిట్‌లిఫ్టర్ టి.సత్యజ్యోతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు స్కూటీపై వెళ్తున్న ఆమెను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇటీవల స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగానికి సెలక్ట్ అయ్యింది. ఆమె మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News November 15, 2025

వాంకిడి: ‘విధ్యార్థులకు పౌష్టికాహారం అందించాలి’

image

ప్రభుత్వ పాఠశాలలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం వాంకిడి(M) ఖమానా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనం నాణ్యత, నిర్వహణ, బోధనా విధానం, హాజరు పట్టికలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలన్నారు.