News February 2, 2025
తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు..1.48 కిలోల బంగారం చోరీ
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విల్లాలో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు వరుసగా 4 ఇళ్లలో చేతివాటం ప్రదర్శించి దాదాపు 1.48 కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. విల్లాలోని 80, 81, 82, 83 ఇండ్లలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు మేఘనాథ రెడ్డి ఇంట్లో 1 కేజీ బంగారం, కేశవ నాయుడు ఇంట్లో 48 గ్రాముల బంగారం చోరీకి గురైంది.
Similar News
News February 2, 2025
NZB: 12 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ
నిజామాబాద్ నగరంలోని RTC కాలనీ శక్తిమాన్ హనుమాన్ మందిర్ వద్ద 12 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, 3 వ డివిజన్ కార్పొరేటర్ చింత శ్రీనివాస్, చిటికల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, హనుమాన్ భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు.
News February 2, 2025
శ్రీకాకుళం: మార్చి 3తేదీ వరకు గ్రీవెన్స్ రద్దు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మార్చి 3 తేదీ వరకు గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక – గ్రీవెన్స్) వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం తెలిపారు. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ నిర్వహణ తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని మండలాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వెల్లడించారు.
News February 2, 2025
పుంగనూరుకు చేరుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు
సోమల మండలంలో జరుగు ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చేరుకున్నారు. ఆయనతోపాటు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ చదల్ల గ్రామంలోని ఎం. వేణుగోపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల ప్రాంతంలో సోమల బహిరంగ సభలో పాల్గొననున్నారు.