News March 19, 2024
ధర్మారం: చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చోటుచేసుకుంది. SI సత్యనారాయణ వివరాల ప్రకారం.. కొత్తూరుకు చెందిన నర్సింగం.. సాగల నారాయణ పొలంలోని వ్యవసాయ బావిలో చేపలు పట్టుకునేందుకు దిగాడు. అందులోని ఓ తీగ ప్రమాదవశాత్తు అతడి చేతులకు చుట్టుకుని బావిలో నడుము భాగం వరకు మునిగిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
Similar News
News January 8, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,06,752 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.59,516, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,895, అన్నదానం రూ.17,341 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
News January 7, 2025
KNR: పంచాయతీ పోరు.. దావతుల జోరు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మార్చి, ఏప్రిల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఫిబ్రవరిలోపే ఎలక్షన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకముందే ఆశావహులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ముందస్తు దావతులు ఇస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈసారి సర్పంచ్ బరిలో నిలిచేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.
News January 7, 2025
అత్యధికంగా కరీంనగర్, అత్యల్పంగా రామగుండం
ఉమ్మడి KNR జిల్లాలోని ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 29,98,815 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా KNR నియోజకవర్గంలో 3,68,269 మంది ఉండగా.. 2,16,389 మంది ఓటర్లు అతి తక్కువగా రామగుండంలో ఉన్నారు. KNR(D) 10,83,365, జగిత్యాల(D) 7,20,825, PDPL(D) 7,18,042, SRCL(D) 4,76,604 ఉండగా.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,51,150 మంది ఓటర్లు ఉన్నారు.