News February 2, 2025
జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ<<15332056>> రిజర్వాయర్‌లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News July 10, 2025
జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి

జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, సాగు, తాగునీరు విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిధులు తెచ్చే బాధ్యత నాది అని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, పథకాలు పేదలకు అందేలా చూడాలన్నారు. కలెక్టర్, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు.
News July 10, 2025
ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలి: WGL కలెక్టర్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ఆయా క్లినికల్ విభాగాల్లో వసతుల కేటాయింపు ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్ సత్య శారద దేవి ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్అండ్‌బీ అధికారులు, వైద్యాధికారులతో కలిసి బుధవారం ఆసుపత్రిని సందర్శించారు. క్షేత్ర స్థాయిలో నిర్మాణంలో ఉన్న గదులు వాటిలో ఏర్పాటు చేయాల్సిన వసతులను అడిగారు.
News July 10, 2025
సంగారెడ్డి: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు: కలెక్టర్

ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభదాయకమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామంలో నాగిశెట్టి రాథోడ్ పొలంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. 90% రాయితీతో మొక్కలు, డ్రిప్ పరికరాలు, అంతర పంటలకు ఎకరాకు రూ.4,200 ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.