News February 2, 2025
HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Similar News
News July 7, 2025
సూళ్లూరుపేటలో వ్యభిచార గృహాలపై దాడులు

సూళ్లూరుపేటలోని పలు లాడ్జీలలో ఆదివారం పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ దాడుల్లో ఓ నిర్వాహకురాలితోపాటు, ఇద్దరు మహిళలు, ఒక విటుడుని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News July 7, 2025
వరంగల్: కోరికలు తీరాలని తాళం వేస్తారు!

ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన సాంప్రదాయం ఉంటుంది. అలాగే, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గాలో యాకుబ్ షావలి బాబా దర్శనానికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరాలని దర్గాలోని గ్రిల్స్‌కు తాళం వేస్తారు. కోరికలు నెరవేరిన అనంతరం దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి కులమతాలకతీతంగా వచ్చే భక్తులు ఈ ఆనవాయితీని పాటిస్తుండటం విశేషం. ప్రతి శుక్రవారం, ఆదివారం భక్తులు కిక్కిరుస్తారు.
News July 7, 2025
భద్రాద్రి: ‘ఎకో వారియర్’ తయారీలో ‘స్ఫూర్తి’

మణుగూరు పట్టణానికి చెందిన స్ఫూర్తి అనే యువతి పర్యావరణహిత వాహనాన్ని తయారు చేశారు. తండ్రి మెకానిక్, సోదరుడు ఎలక్ట్రీషియన్ కావడంతో చిన్ననాటి నుంచి సాంకేతికత పట్ల అవగాహన పెంచుకుంది. ప్రభుత్వ ITIలో ఏటీసీ విద్యను అభ్యసిస్తున్న ఆమె అధ్యాపకుల ప్రోత్సాహంతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల పాత ఇనుప దుకాణంలో సామాన్లను సేకరించి రూ.40 వేల ఖర్చుతో ‘ఎకో వారియర్’ వాహనాన్ని రూపొందించారు.