News February 2, 2025
జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ<<15332056>> రిజర్వాయర్‌లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 25, 2026
విశాఖలో దారుణం.. భార్యను చంపేసిన భర్త

విశాఖ(D) ఆరిలోవ బాలాజీ నగర్‌లో భార్యను, భర్త చంపేసిన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడే ఉంటున్న బురదపాటి దేముడు, దుర్గ(33)కు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం ఇదే తరహాలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకోగా చున్నీని ఆమె మెడకు చుట్టి చంపేసి ఇంట్లో దాక్కున్నాడు. దుర్గ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని సీఐ మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News February 25, 2026
పాలకొల్లు: మేకా శేషుబాబుపై సస్పెన్షన్ ఎత్తివేత

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై విధించిన సస్పెన్షన్‌ను వైసీపీ అధిష్ఠానం ఎత్తివేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు మంగళవారం రాత్రి ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇటీవల వైఎస్ జగన్‌ను కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన శేషుబాబు, త్వరలోనే రీఎంట్రీ ఇస్తారనే ప్రచారానికి ఈ నిర్ణయంతో బలం చేకూరింది. పార్టీ ప్రకటనతో ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 25, 2026
యాదగిరిగుట్టలో ఎదురుకోలు ఉత్సవం

యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అశ్వ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. అనంతరం రాత్రి 8:45 గంటలకు ఎదురుకోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను కనులార తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


