News February 2, 2025

GBS కలకలం.. పెరుగుతున్న మరణాలు

image

మహారాష్ట్రలో గిలియన్ బార్ సిండ్రోమ్‌తో మరో మరణం సంభవించింది. నాందేడ్‌లో 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆ రాష్ట్రంలో GBS మరణాల సంఖ్య 5కు పెరిగింది. మరోవైపు పుణేలో కేసుల సంఖ్య 149కి చేరింది. తాజాగా అస్సాంలో తొలి GBS మరణం నమోదైంది. ఇటీవల తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన <<15316737>>ఓ మహిళ<<>> ఈ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.

Similar News

News February 2, 2025

విలేకరిపై పూజా హెగ్డే ఆగ్రహం

image

‘దేవా’ మూవీ ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరిపై నటి పూజా హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సల్మాన్, హృతిక్, రణ్‌వీర్, షాహిద్ వంటివారి సరసన అవకాశాలు రావడం మీ లక్ అనుకుంటున్నారా? అందుకు మీకు అర్హత ఉందని భావిస్తున్నారా? పెద్ద హీరోల్ని చూసి సినిమాలు సెలక్ట్ చేసుకుంటారా?’ అంటూ విలేకరి అడిగిన ప్రశ్నల పట్ల ఆమె మండిపడ్డారు. నాతో మీ సమస్యేంటి అని ప్రశ్నించారు. వెంటనే హీరో షాహిద్ కలుగజేసుకుని ఆమెను శాంతింపజేశారు.

News February 2, 2025

గచ్చిబౌలి కాల్పుల కేసు.. నిందితుడి వద్ద 460 బుల్లెట్లు

image

TG: గచ్చిబౌలి <<15334177>>కాల్పుల కేసులో<<>> కీలక విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో పోలీసులు మూడో గన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ వద్ద 460 బుల్లెట్లు లభించాయి. బిహార్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభాకర్ తన సాఫ్ట్ వేర్ స్నేహితుడి గదిలో ఉంటున్నట్లు గుర్తించారు. గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లిన అతను తోటి ఖైదీని చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.

News February 2, 2025

ప్రపంచ జనాభా.. బ్లడ్ గ్రూపుల వారీగా

image

O+: 42 శాతం
A+: 31 శాతం
B+: 15 శాతం
AB+: 5 శాతం
O-: 3 శాతం
A-: 2.5 శాతం
B-: 1 శాతం
AB-: 0.5 శాతం
**మరి మీది ఏ గ్రూప్..? కామెంట్ చేయండి.