News February 2, 2025
SKLM: సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఆదివారం ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ, సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సుమారు 5000 మందితో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. 12 రకాల ఆసనాలు వివరిస్తూ అందరితో చేయించారు. సూర్య నమస్కారం రెగ్యులర్ అభ్యాసం మెరుగైన మానసిక స్పష్టత వస్తుందన్నారు.
Similar News
News November 5, 2025
నేడు శ్రీకాకుళం జిల్లా సమీక్ష సమావేశం: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం బుధవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ప్రవాస భారతీయుల సాధికారత సంబంధాల శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతుందన్నారు. అజెండాలోని అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించనున్నట్లు వివరించారు.
News November 4, 2025
ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్‌లు ఇన్‌స్టాల్ చేయాలన్నారు. 200 ఈ-హబ్ ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం పరిశీలించాలన్నారు.
News November 4, 2025
శ్రీకాకుళం: ‘పుణ్యక్షేత్రాల్లో రద్దీ నియంత్రణ కట్టుదిట్టం చేయాలి’

జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాసం మిగిలిన పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్ట్యా పటిష్ఠమైన రద్దీ నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో వీసీ నిర్వహించారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి వంటి ముఖ్య రోజుల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నందున భద్రతలు చర్యలు తీసుకోవాలన్నారు.


