News February 2, 2025
నారాయణపేట జిల్లాలో భారీ మొసలి కలకలం

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News February 18, 2026
ఈసారైనా గందరగోళం లేకుండా సాగుతాయా?

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గత నవంబర్‌లో పీజీ పరీక్షలలో ప్రశ్నాపత్రాల్లో తప్పులు, నిర్వహణలో లోపాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈసారి సెమిస్టర్ పరీక్షలైనా సమర్థవంతంగా నిర్వహిస్తారా? అన్న సందేహం విద్యార్థుల్లో నెలకొంది. అధికారులు ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
News February 18, 2026
ములుగు జిల్లాలో అలజడి.. అడవుల్లో జల్లెడ!

ములుగు జిల్లాలో వారం రోజులుగా పోలీసు బలగాలు విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. గుత్తికోయ గూడాలు, మారుమూల పల్లెల్లో ఆరా తీస్తూ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ ఉన్నాడనే గుసగుసల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
News February 18, 2026
పోచంపల్లి: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

మద్యపానం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. పోచంపల్లి మండలం జూలూరులో పద్మ అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆంజనేయులు మద్యం తాగి రావడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపంతో గురైన పద్మ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వీరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


