News February 2, 2025
నెక్కొండ: పారా అథ్లెటిక్స్‌లో దేవాకు బంగారు పతకాలు
నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన నునావత్ దేవా రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 17 -20వ తేదీ వరకు తమిళనాడులోని చెన్నైలో జరగబోయే 23వ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలకు దేవా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పారా అథ్లెటిక్స్ అధ్యక్షుడు శేఖర్ అభినందించారు.
Similar News
News February 2, 2025
ఇంటర్ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే ప్రయోగ పరీక్షల వివరాలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 36 జనరల్ పరీక్షా కేంద్రాలు, 7 ఒకేషనల్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
News February 2, 2025
మహబూబాబాద్: మహిళపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్
లైంగిక దాడి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు సీఐ, ఎస్ఐ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తొర్రూరుకి వలస వచ్చారు. ఈక్రమంలో నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్‌తండాకు చెందిన దేశిలావ్ JAN 29న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో బాలికపై లైంగిక దాడికి యత్నించిన కాంస్యతండా వాసి బానోత్ అజయ్‌పై పొక్సో కేసు నమోదవ్వడంతో అరెస్ట్ చేశారు.
News February 2, 2025
రాత్రి కాజీపేట్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు
నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడం కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాజీపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి రైల్వే స్టేషన్‌లో తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులతో పాటు బ్యాగులను తనిఖీ చేశారు.