News February 2, 2025
MBNR: పరీక్షల షెడ్యూల్ విడుదల
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd) మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష హాలులోకి తప్పనిసరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలిపారు.
Similar News
News February 2, 2025
ADB రిమ్స్ ఆసుపత్రిలో NCD క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్
అసాంక్రమిక వ్యాధులచే బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో NCD క్లినిక్ ను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. అనంతరం రోగులను పరీక్షించే గది, వ్యాధిగ్రస్తులకు సేవలు అందించే గదులను ఆయన సందర్శించారు. NCD క్లినిక్‌లో అసాంక్రమిక వ్యాధులతో (రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మొదలైనవి) వాటితో బాధపడుతున్న వ్యాధిగ్రస్థులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
News February 2, 2025
ఢిల్లీ ఎన్నికల్లో విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలోని షాలిమార్ ప్రాంతంలో ఆయన తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కాలనీలో ప్రచారం చేశారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆటోలో ప్రయాణించారు.
News February 2, 2025
ట్యాంక్ బండ్‌పై కాంగ్రెస్ శ్రేణుల నిరసన
HYD ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, బీజేపీ రాష్ట్రంపై వివక్ష చూపిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో చిన్నదైన రాష్ట్రానికి సరిగ్గా నిధుల కేటాయింపు జరగలేదని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.