News March 19, 2024
ADB: యువకుడి ఆత్మహత్య.. తల, మొండెం వేరు

తలమడుగు గ్రామానికి చెందిన పెందూర్ సునీల్(27) సోమవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సునీల్ కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో తండ్రి భూమన్న మందలించాడు. మనస్తాపం చెందిన యువకుడు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News August 16, 2025
లారీ డ్రైవర్‌ను కాపాడిన తర్నం వాసులు

తర్నం వాగులో వరద ఉద్ధృతి కొంత మేర తగ్గింది. దీంతో వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్‌ను తాడు సహాయంతో కాపాడారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఇదే వాగులో జైనథ్ మండలానికి చెందిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. వరద సమయంలో వాహనదారులు వాగు వైపు వెళ్లకుండా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News August 16, 2025
తాంసి: రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని తాంసి మండలం కప్పర్ల రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశాల్ శ్రీ రాముడిని కృష్ణుడి రూపంలో అలంకరించారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న రాముడి రూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
News August 15, 2025
రాష్ట్రపతి విందులో పాల్గొన్న ADB ఉపాధ్యాయుడు

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోని at home కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ఆదిలాబాద్ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుతులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విందులో పాల్గొన్నారు. కైలాస్ రాష్ట్రపతి, ప్రధానీకి గోండి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్పించాలని విన్నవించారు.