News February 2, 2025

MBNR: పరీక్షల షెడ్యూల్‌ విడుదల

image

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ (B.PEd) మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష హాలులోకి తప్పనిసరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలిపారు.

Similar News

News September 18, 2025

ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News September 18, 2025

శుభ సమయం (18-09-2025) గురువారం

image

✒ తిథి: బహుళ ద్వాదశి రా.12.25 వరకు
✒ నక్షత్రం: పుష్యమి ఉ.8.59 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: సా.5.29-సా.7.02
✒ అమృత ఘడియలు: ఉ.6.38-ఉ.8.10

News September 18, 2025

కానిస్టేబుల్ నుంచి టీచర్లుగా..

image

నందికొట్కూరు సర్కిల్ పరిధిలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఎస్.నాగ మల్లయ్య, ఎం.జ్యోతి డీఎస్సీలో ఉత్తీర్ణులై టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నాగ మల్లయ్య నందికొట్కూరు, జ్యోతి బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం వీరిని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం సన్మానించి, అభినందించారు.