News February 2, 2025

భూపాలపల్లి: వాలీ బాల్ ఆడిన ఎమ్మెల్యే గండ్ర

image

భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో వాలీ బాల్ క్లబ్ గెట్ టు గెదర్ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు వాలీ బాల్ ఆడి సందడి చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు.  

Similar News

News July 4, 2025

KNR: 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ల సస్పెండ్

image

కరీంనగర్‌లోని ఓ ప్రవేట్ మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను మేనేజ్మెంట్ సస్పెండ్ చేసింది. డాక్టర్స్ డే రోజు జరిగిన కార్యక్రమంలో తమ పెండింగ్ స్టైఫండ్‌ నిధులను రిలిజ్ చేయాలని నిరసన వ్యక్తం చేసినందుకే తమని సస్పెండ్ చేశారని విద్యార్థులు వాపోయారు.

News July 4, 2025

అనకాపల్లి జిల్లాలో పార్కు నిర్మాణానికి ఆమోదం

image

విశాఖలో V.M.R.D.A. బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. పలు అభివృద్ధి పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా కొత్తూరులో రూ.5 కోట్లతో సుమారు 5.68 ఎకరాల్లో పార్కు నిర్మించనున్నారు.‌ వేపగుంట-పినగాడి మధ్య 60 అడుగుల రోడ్డు నిర్మిస్తారు. మధురవాడ, మారికవలస, వేపగుంటలో <<16943032>>అపార్ట్మెంట్లు<<>> నిర్మించేందుకు అమోదం తెలిపారు. ఛైర్మన్ ప్రణవ గోపాల్, ఎంసీ విశ్వనాథన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.

News July 4, 2025

ఖమ్మం: తీవ్ర విషాదం.. ఇద్దరు యువకుల మృతి

image

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఘోర విషాదం నెలకొంది. చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో వాగులో ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారు అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.