News February 2, 2025
నూతన డీజీపీని కలిసిన ప.గో ఎస్పీ
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనను ప.గో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీకి పూల మొక్క అందజేశారు. అనంతరం జిల్లాలోని లా అండ్ ఆర్డర్ గురించి డీజీపీకి వివరించారు.
Similar News
News February 2, 2025
ప.గో. ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పించిన జెసీ
భీమవరం పట్టణంలోని పలు షాపులలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ షాపుల యజమానులకు ప్లాస్టిక్ వాడకంపై కలిగే నష్టాలను వివరించారు. పేపర్ కవర్లను, గుడ్డ సంచులను వాడే విధంగా అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
News February 1, 2025
భీమవరం: ‘చనిపోయిన తాబేళ్లకు పోస్టుమార్టం చేయాలి’
పర్యావరణానికి హితము చేకూర్చే సముద్ర జీవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లో మత్స్యశాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. చనిపోయిన తాబేళ్లు చినమైనివారిలంక, పెద్దమైనివారిలంక తీర ప్రాంతానికి కొట్టుకు రావడానికి గల కారణాలపై సమీక్షించారు. వాటికి పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు.
News February 1, 2025
నరసాపురం: కాలువలో మృతదేహం
వేటాడేందుకు వెళ్లిన మత్స్యకారుడు కాలువలో పడి మృతి చెందిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం ముస్కెపాలెంకు చెందిన కొపనాతి లక్ష్మణ్(57) శుక్రవారం వేటాడేందుకు కాలువలోకి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల గాలించినా లక్ష్మణ్ జాడ తెలియలేదు. శనివారం వేములదీవి కాలువలో శవమై కనిపించాడు.