News February 2, 2025

ఇందల్వాయి: కంటైనర్ మీద నుంచి వెళ్లడంతో ఒకరు మృతి

image

ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో కంటైనర్ మీద నుంచి వెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన బత్తుల నాగరాజు (32) ఆదివారం తన బైక్ పై కామారెడ్డి వైపు నుంచి నిజామాబాద్ వెళ్తుండగా చంద్రాయన్పల్లి వద్ద సర్వీస్ రోడ్డు పనులు జరుగుతుండంతో రోడ్డు పక్కన అడ్డంగా పెట్టిన మట్టి బ్యాగులు ఢీకొని నాగరాజు కింద పడ్డాడు. ఆయనపై నుంచి కంటైనర్ వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News February 2, 2025

ఆర్మూర్: ఇది సకల జనుల బడ్జెట్: కలిగోట్ గంగాధర్

image

ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సకల జనులకు ఆమోదయోగ్యంగా ఉందని BJP జిల్లా అధికార ప్రతినిధి కలిగోట్ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని, మధ్య తరగతి వారికి పన్ను భారం తగ్గిందని, రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రద్దు చేశారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపారని అన్నారు.

News February 2, 2025

NZB: 12 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

image

నిజామాబాద్ నగరంలోని RTC కాలనీ శక్తిమాన్ హనుమాన్ మందిర్ వద్ద 12 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, 3 వ డివిజన్ కార్పొరేటర్ చింత శ్రీనివాస్, చిటికల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, హనుమాన్ భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు.

News February 2, 2025

NZB: బడ్జెట్‌పై కాంగ్రెస్ మతిలేని మాటలు: ఎమ్మెల్యే

image

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీజేపీకి చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అన్ని రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు.