News February 2, 2025

HYD: పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి

image

పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. నులి పురుగుల వల్ల చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు

Similar News

News February 2, 2025

కంటి చూపును తిరిగి రప్పించే ఔషధం!

image

కంటి నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ కవచం దెబ్బతిన్నప్పుడు కంటిచూపు మందగిస్తుంది. అలా కోల్పోయే వారి చూపును మెరుగుపరిచే సామర్థ్యమున్న ఔషధాన్ని అమెరికాలోని కొలరాడో పరిశోధకులు అభివృద్ధి చేశారు. LL341070గా పిలుస్తున్న ఈ ఔషధం మైలిన్ మరమ్మతు విషయంలో శరీరానికి సాయంగా నిలుస్తుందని వారు వివరించారు. అయితే ప్రస్తుతం పరిశోధన స్థాయిలో ఉన్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ఔషధాన్ని తీసుకొస్తామని వారు చెప్పారు.

News February 2, 2025

NGKL: బాలికపై బాబాయి అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో బాలికపై బాబాయి అత్యాచారానికి యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలంలోని ఓ తండాలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సొంత బాబాయి(యువకుడు) అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News February 2, 2025

KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని చెప్పారు.