News February 2, 2025
T20 WC: 82కే సౌతాఫ్రికా ఆలౌట్
అండర్-19 ఉమెన్స్ టీ20 WC ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 3 వికెట్లతో సత్తా చాటారు. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83.
Similar News
News February 2, 2025
కంగ్రాట్స్ టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు
U-19 T20 ప్రపంచకప్ గెలుచుకున్న భారత అమ్మాయిల్ని AP CM చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, YSRCP అధినేత YS జగన్ అభినందించారు. ‘మీ కష్టం, సంకల్పంతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి భారతీయుల్ని గర్వించేలా చేశారు’ అని చంద్రబాబు, ‘దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేశారు. తెలుగువారికి త్రిష గర్వకారణం’ అని లోకేశ్ కొనియాడారు. జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని మాజీ CM జగన్ ఆకాంక్షించారు.
News February 2, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరే జట్లివే: పాంటింగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్, ఆస్ట్రేలియా వెళ్తాయని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపారు. ఆ రెండు జట్లు చెరో రెండు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్నట్లు చెప్పారు. వీటికి పోటీగా హోంగ్రౌండ్స్ కావడంతో పాకిస్థాన్ రేసులో ఉంటుందన్నారు. ఈ జట్టు అంచనాలకు దొరకకుండా ప్రదర్శన చేస్తుందన్నారు. పాంటింగ్ వ్యాఖ్యలతో మాజీ కోచ్ రవిశాస్త్రి ఏకీభవించారు.
News February 2, 2025
APPLY NOW.. భారీ జీతంతో ఉద్యోగాలు
BHEL 400 ఇంజినీర్ ట్రైనీ, సూపర్‌వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ఇంజినీర్ పోస్టులు 150 కాగా, మిగతావి సూపర్‌వైజర్ ఉద్యోగాలు. బీటెక్, బీఈ పూర్తైన 27 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి ట్రైనింగ్‌లో రూ.32,000-రూ.50,000 మధ్య, ఆ తర్వాత రూ.33,500-రూ.1,80,000 పేస్కేలుతో జీతం అందిస్తారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం ఇక్కడ <