News February 2, 2025
క్రికెట్ పోటీల్లో గద్వాల రాణించాలి: కలెక్టర్

గద్వాల జిల్లా క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రం, దేశ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో షేర్ అలీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 క్రికెట్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని సూచించారు.
Similar News
News February 24, 2026
WT20 WC: జూన్ 14న భారత్-పాక్ మ్యాచ్

ఇంగ్లండ్ వేదికగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరగనుంది. భారత్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను జూన్ 14న ఢీకొట్టనుంది. టీమ్ ఇండియా జూన్ 17న నెదర్లాండ్స్‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. పూర్తి షెడ్యూల్ పైన ఇమేజ్‌లో చూడవచ్చు.
News February 24, 2026
HNR: ఆన్‌లైన్ పేమెంట్ అని నమ్మించి రూ.40వేలు కొట్టేశారు!

హుజూర్‌నగర్‌లో ఓ కేటుగాడు ఇడ్లీ వ్యాపారిని బురిడీ కొట్టించాడు. నగదు తీసుకుని, ఫోన్ పే చేస్తానని నమ్మబలికి ‘ఫేక్ పేమెంట్’ స్క్రీన్ చూపించి రూ.40,000తో పరారయ్యాడు. సోమవారం జరిగిన ఈ ఘటనపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ లావాదేవీలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాకే నగదు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
News February 24, 2026
విశాఖ పోలీసుల అదుపులో క్రిప్టో కరెన్సీలో కేసులో కీలక సూత్రధారి

క్రిప్టో కరెన్సీ పేరుతో విశాఖలో వందల కోట్లు వసూలు చేసిన కీలక సూత్రధారుడుని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులు సోమవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు PGRSలో ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.రవి కిరణ్ తప్పు చేయలేదని సీఐ భవానీ ప్రసాద్ వాదిస్తుండగా.. బాధితులు మాత్రం మేము అతనికే సొమ్ము చెల్లించామని ఆధారాలు చూపిస్తున్నారు.


