News February 2, 2025

నూతన చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ గిరిధర్

image

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేరన్యాయ చట్టాలు-2023 ద్వారా దర్యాప్తును వేగవంతంగా చేయడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని వనపర్తి ఎస్పీ గిరిధర్ అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ పోలీసు లీగల్ అడ్వైజర్, రిటైర్డ్ పీపీ రాములుతో నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడానికి నూతన చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 

Similar News

News July 6, 2025

పెద్దపల్లి: జీవో నెంబర్‌ 282ను రద్దు చేయాలి

image

జీవో నెంబర్‌ 282ను వెంటనే రద్దు చేయాలని CITU నాయకులు డిమాండ్‌ చేశారు. పెద్దపల్లిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం CITU ఆధ్వర్యంలో జీవో నెంబర్‌ 282 ప్రతులను దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమశక్తిని దోచి, కార్పొరేట్లకు అధిక లాభాలను కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని నాయకులు అన్నారు. 8గంటల పని విధానాన్ని 10గంటలుగా మారుస్తూ చేసిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

News July 6, 2025

NZB: రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కవిత

image

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.

News July 6, 2025

రేపు ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన

image

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో నకిలీ విత్తనాలతో పంటకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను అందజేయనున్నారు. అనంతరం సీతక్క మంగపేట, ఏటూరునాగారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.