News February 2, 2025
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. నెక్కొండ మండలంలో హాస్టళ్లను కలెక్టర్ విస్తృత తనిఖీలు నిర్వహించి, భోజనం రుచి చూసి మాట్లాడారు. హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. పాఠశాల రికార్డులు పరిశీలించి సమయ పాలన పాటించాలన్నారు.
Similar News
News March 11, 2025
అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయ్: రాజ్‌నాథ్ సింగ్

డీలిమిటిషన్‌లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని, తమిళనాడులో కూడా పెరుగుతాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘నియోజకర్గాల పునర్విభజనలో ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుతుందనేది అపోహే. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి. దీనిపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం పునర్విభజన ప్రక్రియ జరుగుతుంది. దీనికి అందరి సలహాలు స్వీకరిస్తాం’ అని చెప్పారు.
News March 11, 2025
ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ మల్టీస్టారర్?

ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. నటి అలియా భట్ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో ప్రకటించారు. ‘బ్యాటిల్ ఆఫ్ ది బెస్ట్. నాకు అత్యంత ఇష్టమైన ఇద్దరు నటులు పోటీ పడనున్నారు. చాలా ఉత్సుకతగా ఉంది. మరిన్ని వివరాలు రేపు చెప్తా. నాకెంత నచ్చిందో మీకూ అంత నచ్చుతుంది. నాకు తెలుసు’ అని పోస్ట్ చేశారు. దీంతో ఇది మల్టీస్టారరా లేక ఏదైనా ప్రకటనా అంటూ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
News March 11, 2025
మొదలైన ఐపీఎల్ సందడి

ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో దేశంలో IPL ఫీవర్ ప్రారంభమైంది. ఆయా జట్ల ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే తమ జట్లతో చేరుతున్నారు. RCB కెప్టెన్ రజత్ పాటిదార్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ టీమ్‌తో జతకలిశారు. కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ (RCB), నోకియా, డికాక్, రమణ్‌దీప్ సింగ్ (KKR) తదితరులు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈ నెల 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.