News February 2, 2025

ఈ నెల 4న కులగణనపై క్యాబినెట్ భేటీ

image

TG: రాష్ట్రంలో బీసీల సామాజిక న్యాయానికి అడుగుపడిందని క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులగణన సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. ఇలాంటి సర్వే దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. ఈ నెల 4న నివేదికపై క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలోనూ డిస్కస్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 2, 2025

SHOCKING: భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య!

image

ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో కలిసి పారిపోవాలనుకుంది. అలా వెళ్లిపోతే ఒకెత్తు. కానీ మరీ అన్యాయంగా భర్త కిడ్నీని భర్తతోనే విక్రయింపచేసింది. కూతురి జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది. ఆమెను నమ్మిన భర్త కిడ్నీ అమ్మేసి రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైందా ఇల్లాలు. బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

News February 2, 2025

అభిషేక్ ఇన్నింగ్సుపై యువరాజ్ ట్వీట్

image

ఇంగ్లండ్‌పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను అతని కోచ్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ప్రశంసల్లో ముంచెత్తారు. అద్భుతంగా ఆడావని కొనియాడారు. ఇదే ఆటను తాను చూడాలనుకున్నానని, గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ మ్యాచులో 37 బంతుల్లో సెంచరీ చేసిన అభి, మొత్తంగా 54 బాల్స్‌లో 13 సిక్సర్లతో 135 రన్స్ చేశారు.

News February 2, 2025

5 మ్యాచుల్లో 35 పరుగులే

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత ప్లేయర్ సంజూ శాంసన్ పేలవ ప్రదర్శన చేశారు. ఆడిన 5 మ్యాచుల్లో 7 సగటుతో 35 పరుగులే చేశారు. ఇవాళ్టి మ్యాచులో సిక్సర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించి ఊపు మీదున్నట్లు కనిపించినా రెండో ఓవర్లోనే పుల్ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. దీంతో శాంసన్‌కు ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. గైక్వాడ్ వంటి ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.