News February 2, 2025
భీమడోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలోని రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలతో ఆదివారం మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25-30 మధ్య ఉంటుందని, ఎత్తు 5.6, నలుపు జుట్టు, సామాన్య దేహదారుఢ్యం కలిగి ఉందని ఏలూరు రైల్వే SI పి. సైమన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు సెల్ నంబర్ 9989219559 కు సంప్రదించాలని కోరారు.
Similar News
News November 13, 2025
గద్వాల్ కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి

గద్వాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె.సంధ్యా కిరణ్మయి కలెక్టర్ సంతోష్‌ను కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయనను కలిసి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ జిల్లాను అన్ని పారామీటర్స్‌లో ముందు ఉంచాలని, జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
News November 13, 2025
ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్‌తో ఆ కిలేడీకి సంబంధాలు!

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్‌ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్‌లో జైషే మహిళా వింగ్ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్‌కౌంటర్‌లో ఉమర్ హతమయ్యాడు.
News November 13, 2025
వరంగల్ కమిషనర్ పరిధిలో 110 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 110 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 57 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనాన్ని సైతం సీజ్ చేయడం జరుగుతుందని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.


