News February 2, 2025
రేపు పార్లమెంట్‌కు వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదిక

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికను JPC ఛైర్మన్ జగదాంబికా పాల్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించి ఆమోదించే అవకాశం ఉంది. ఇటీవలే ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన 44 సవరణల్ని జేపీసీ తిరస్కరించగా, NDA సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలను ఆమోదించింది. సవరణలకు 16 మంది మద్దతివ్వగా, 10 మంది వ్యతిరేకించారు.
Similar News
News February 17, 2026
పంచాయతీలకు రూ.250 కోట్లు

TG: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు రూ.250 కోట్లను విడుదల చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించడానికి ఈ నిధులను వినియోగిస్తారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రూ.387 కోట్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
News February 17, 2026
మళ్లీ పెళ్లికి సిద్ధం: మమతా మోహన్ దాస్

మరోసారి ప్రేమలో పడేందుకు, పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని హీరోయిన్ మమతా మోహన్‌దాస్ వెల్లడించారు. అందుకు తగిన వ్యక్తి దొరకాలని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2011లో బిజినెస్‌మ్యాన్ ప్రేజిత్‌తో ఆమె వివాహం జరగగా ఏడాదికే విడిపోయారు. ‘ప్రేజిత్‌ను ఓ పెళ్లిలో మళ్లీ కలిశా. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా అనిపించాయి. మళ్లీ మనం పెళ్లి ఎందుకు చేసుకోకూడదని అడిగాడు. వెళ్లి మా నాన్నతో మాట్లాడమని చెప్పా’ అని తెలిపారు.
News February 17, 2026
వేరుశనగలో మొవ్వు కుళ్లు వైరస్ – నివారణ

మొవ్వు కుళ్లు వైరస్ సోకిన వేరుశనగ మొక్కల ఆకులపై తొలుత పచ్చని పాలిపోయిన వలయాలు ఏర్పడతాయి. పత్రహరితం పలచగా మారి మచ్చలు కనిపిస్తాయి. మొక్క మొవ్వు నల్లగా మారి ఎండిపోతుంది. మొక్కలు గిడసబారి, గుబురుగా ఉండి చిన్నచిన్న ఆకులు మెలితిరిగి ఉంటాయి. తెగులు సోకిన మొక్కల నుంచి వచ్చిన కాయ, విత్తనాలు చిన్నవిగా ఉంటాయి. తెగులు నివారణకు పంట 30 రోజులప్పుడు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


