News February 2, 2025
జగిత్యాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన డిచ్పల్లి పెద్ద గంగారం (48) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రైతు సాగుతో పాటు గొర్రెల కాపరిగా పనిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పెద్ద గంగారాం శనివారం రాత్రి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలలకు కొత్త భవనాలు

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలల్లో అదనంగా నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. గీసుగొండ మండలం నందనాయక్ తండా, నర్సంపేట మండల బోజ్యానాయక్ తండా, చిన్న గురజాల, పార్శ్య నాయక్ తండా, స్వామి నాయక్ తండాల్లో ఏర్పాటు చేయనున్న నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో డీఈవోను ఆదేశించారు.
News July 6, 2025
జగిత్యాల: మిస్టరీగా 5 ఏళ్ల చిన్నారి మృతి!

కోరుట్లలోని <<16959055>>5 ఏళ్ల చిన్నారి మృతి <<>>కేసు మిస్టరీగా మారింది. అభం శుభం తెలియని బాలిక హితీక్ష ప్రమాదవశాత్తు మరణించిందా లేదా హత్య చేశారా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. అయితే నిన్న సాయంత్రం పెద్దపులుల విన్యాసాలు చూసేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన చిన్నారి భయంతో బాత్రూంలో దాక్కోగా కాలుజారి అక్కడే ఉన్న నల్లాపై పడి చనిపోయిందనే అనుమానమూ వ్యక్తమవుతోంది. బాలిక తండ్రి రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటున్నారు.
News July 6, 2025
వత్సవాయిలో ప్రమాదం.. ఒకరి మృతి

వత్సవాయి నుంచి వైరా వెళ్లే రహదారిలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో తాళ్లూరు వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, పెనుగొండ బాల, రాయల రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.