News February 2, 2025

లింబాద్రి గుట్ట స్వామిని దర్శించుకున్న శ్రీముఖి

image

భీమ్‌గల్ మండలం లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆమెకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను శాలువాతో సన్మానించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఆమెతో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు.

Similar News

News February 3, 2025

NZB: జిల్లా జైలును సందర్శించనున్న DG సౌమ్య మిశ్రా

image

నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్‌లో ఉన్న జిల్లా జైలును సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (DG) సౌమ్య మిశ్రా సందర్శించనున్నట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ఉదయం జిల్లా జైలుకు వచ్చే ఆమె అక్కడ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడతారని అధికారులు వివిరించారు. కాగా ఆమె పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

News February 2, 2025

NZB: దిల్ రాజుకు ఆహ్వానం

image

నిజామాబాద్‌లో వారాహి అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఆదివారం వారాహి మాత ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేందర్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 10న ఆలయ శంకుస్థాపన నిర్వహిస్తున్నామని వివరించారు.

News February 2, 2025

ఆర్మూర్: ఇది సకల జనుల బడ్జెట్: కలిగోట్ గంగాధర్

image

ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సకల జనులకు ఆమోదయోగ్యంగా ఉందని BJP జిల్లా అధికార ప్రతినిధి కలిగోట్ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని, మధ్య తరగతి వారికి పన్ను భారం తగ్గిందని, రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రద్దు చేశారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపారని అన్నారు.