News February 2, 2025
అచ్చంపేట: బాలికపై బాబాయి అత్యాచారయత్నం.. కేసు నమోదు
నాగర్‌కర్నూల్ జిల్లాలో బాలికపై బాబాయి అత్యాచారానికి యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలంలోని ఓ తండాలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సొంత బాబాయి(యువకుడు) అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 3, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 3, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: ఫిబ్రవరి 03, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 3, 2025
పాలమూరులో అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుపు: DK అరుణ
జడ్చర్లలో నూతనంగా ఏర్పాటుచేసిన బీజేపీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని అన్నారు. ఉద్యోగుల శ్రేయస్సు, మహిళలు, రైతులు, యువకులు, ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారని తెలిపారు.