News February 2, 2025
రేపు గ్రివెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పీజీఆర్ఎస్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు ఉదయం 9:30 గంటలకే పీజీఆర్ఎస్‌కు హాజరు కావాలని ఆదేశించారు.
Similar News
News January 9, 2026
తూ.గో: హోటళ్లు, రిసార్టులు హౌస్‌ఫుల్

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి తరలివస్తున్న అతిథులతో సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి 18 వరకు హోటళ్లు, రిసార్టులు ఇప్పటికే నిండిపోయాయి. కోడిపందాలు, పడవ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలకు ప్రముఖులు హాజరవుతున్నారు. అతిథుల మర్యాదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 9, 2026
గర్భాశయ రక్తస్రావం గురించి తెలుసా?

మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వయస్సుతో పాటు అనేక గర్భాశయ సంబంధిత సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిల్లో ఒకటే గర్భాశయ రక్తస్రావం. పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, పీరియడ్స్ మధ్య స్పాటింగ్, సంభోగం తర్వాత రక్తస్రావం ఉన్నా గర్భాశయ రక్తస్రావం అంటారు. ఇది ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, PCOS, థైరాయిడ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News January 9, 2026
సిద్దిపేట: 11వ శతాబ్దపు గణపతి విగ్రహం లభ్యం

సిద్దిపేట జిల్లా మద్దూరు మం. వల్లంపట్లలో పురాతన గణపతి విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు మహేశ్ గుర్తించారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ 5 అడుగుల చతుర్భుజ గణపతి శిల్పం లలితాసనంలో ఎంతో ప్రత్యేకంగా ఉంది. పరహస్తాలలో పరశువు, పుష్పం, నిజ హస్తాలలో విరిగిన దంతం కలిగి ఉన్న ఈ విగ్రహం కళాత్మకతకు నిదర్శనమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆలయ పునర్నిర్మాణ సమయంలో ఈ చారిత్రక సంపద వెలుగులోకి వచ్చింది.


