News March 19, 2024
పులివెందుల: టైంకు అన్నం పెట్టలేదని హత్య

అన్నంలోకి కూరలు సకాలంలో తీసుకురాలేదని కోపంతో రెడ్డి బాబును(15) అతని చిన్నాన్న సురేశ్ దాడి చేసి హత్య చేశాడు. సురేశ్‌కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఒక రూములో ఉంచి రోజు భోజనాలు పెట్టేవారు. సోమవారం చిన్నాన్నకు భోజనం పెట్టడంలో ఆలస్యం కావడంతో సురేశ్ ఆగ్రహంతో రెడ్డి బాబును తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన రెడ్డిబాబు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 25, 2026
కడప జిల్లాలో పలువురు SDCలకు పోస్టింగ్.!

జిల్లాలో పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. కడప TGP SDCగా శివరాముడు, KRRC SDCగా నాగరాజు, డిజాస్టర్ మేనేజ్మెంట్ DPMగా హరి ప్రసాద్, ముద్దనూరు GNSS SDCగా వెంకటేశ్వర్లు, రాజంపేట సోమశిల ప్రాజెక్టు SDCగా శివరామిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. వీరిలో కొందరికి పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇచ్చారు.
News February 24, 2026
కడప: ఆహార కల్తీపై క్రిమినల్ కేసులు నమోదు: హరిత

ఆహార కల్తీపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారి హరిత హెచ్చరించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో మంగళవారం జిల్లాలో తనిఖీ చేపట్టినట్టు తెలిపారు. దాడులు కొనసాగుతాయన్నారు. పాల కేంద్రాలు, హోటళ్లు, టీ స్టాళ్లలో పాల శాంపిల్స్ సేకరించామన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హలీం తయారీలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆహార తయారీలో టేస్టింగ్ సాల్ట్, కలర్స్ వాడకూడదన్నారు.
News February 24, 2026
కడప: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష.. 382 మంది గైర్హాజరు

ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం జిల్లాలో 62 కేంద్రాల్లో 15,159 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 14,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 14,011 మంది జనరల్ విద్యార్థుల్లో 13,691 మంది హాజరవ్వగా.. 320 మంది గైర్హాజరయ్యారు. 1,148 మంది ఒకేషనల్ విద్యార్థుల్లో 1,086 మంది హాజరవ్వగా.. 62 మంది పరీక్షలు రాయలేదు.


