News February 2, 2025
వెల్దుర్తి ఎస్ఐకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
పత్తికొండలో కేఈ మాదన్న స్మారక జ్ఞాపకార్థం దక్షిణ భారత స్థాయి టీ-20 క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఆదివారం పోలీసుల జట్టు, ఫ్రెండ్స్ లెవేన్ జట్టు తలపడగా.. పోలీస్ జట్టు విజయం సాధించింది. వెల్దుర్తి ఎస్ఐ అశోక్ బ్యాటింగ్‌లో అర్థ సెంచరీ, బౌలింగ్‌లో రెండు వికెట్లతో రాణించి సత్తా చాటాడు. విజయంలో కీలకంగా వ్యవహరించిన అశోక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Similar News
News February 3, 2025
రాయలసీమకు రూ.1.52లక్షల కోట్ల పెట్టుబడులు
రాయలసీమకు రూ.1.52లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. వేల మందికి ఉద్యోగాలు లభిస్తామని తెలిపారు. కర్నూలులో ఏజీ జెన్కో, ఎన్‌హెచ్‌టీసీ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. కడప, నంద్యాల జిల్లాల్లో SAEL సోలాల్ ఎంహెచ్పీ-2 రూ.1,728 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ఇక ఓర్వకల్లుకు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
News February 3, 2025
కర్నూలుకు జడ్జిల బృందం
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ స్పీడందుకుంది. బెంచ్‌కు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు వస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. దిన్నెదేవరపాడు వద్ద APERCకి చెందిన భవనాన్ని జడ్జిల బృందం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. కాగా గతేడాది రూ.25కోట్ల నిధులతో అత్యాధునిక హంగులతో ఆ భవనాన్ని నిర్మించారు.
News February 3, 2025
బస్ డ్రైవర్‌కు గుండెపోటుకు.. ప్రయాణికులు క్షేమం
ఆలూరులో నిన్న ఓ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. డ్రైవర్‌కు గుండెపోటుకు గురికావడమే ఈ ఘటనకు కారణంగా తెలిసింది. ట్రావెల్స్ బస్సు ఆదోని నుంచి బళ్లారికి వెళ్తోంది. పట్టణంలోని సాయిబాబా ఆలయం సమీపంలోకి రాగానే డ్రైవర్ ఉసేన్ (64)కు గుండెపోటు వచ్చింది. బస్సు స్టీరింగ్ అదుపు తప్పడం ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొంది. అందులోని భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ మృతి చెందారు.