News February 2, 2025
ములుగు: రేపు ప్రజావాణి రద్దు
ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఇబ్బంది కలగకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News February 3, 2025
రాజమండ్రి: మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందన్న PGRS సెషన్‌లు నిర్వహించమని కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా మండల కేంద్రల్లో ప్రజల నుంచి అర్జీలను అధికారులు స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు గమనించి అధికారులకు సహకరించాలన్నారు. ఎన్నికల అనంతరం యధవిధిగా కొనసాగుతుందన్నారు.
News February 3, 2025
KKD: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పీజీఆర్ఎస్ రద్దు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కాకినాడ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం రద్దుచేస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తూర్పు-పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుల కోరకు సంబంధిత సచివాలయంలో మీకోస పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News February 3, 2025
సాలూరు అమ్మవారి పండుగపై మంత్రి సమీక్ష
సాలూరు శ్యామలాంబ తల్లి పండుగను మే 18,19,20 తేదీల్లో నిర్వహించనున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ పండగ జరగనుంది. దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. పండగ ఏర్పాట్లపై పెద్దలు, అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.