News February 2, 2025

కొడంగల్: TGCPSEU జిల్లా కార్యదర్శిగా క్రాంతి కుమార్

image

తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొడంగల్ పట్టణానికి చెందిన క్రాంతి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పాత పెన్షన్ స్కీంను సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. తనను జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 13, 2025

పల్నాడులో విష జ్వరాల విజృంభణ.. ఐదేళ్ల చిన్నారి మృతి

image

వాతావరణంలో మార్పుల కారణంగా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. ముందుగా జలుబు, దగ్గుతో ప్రారంభమై క్రమంగా జ్వరంగా మారుతుందని, చాలా మంది గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో ఐదేళ్ల చిన్నారి నాగలక్ష్మీ విష జ్వరంతో మృతి చెందడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై వైద్య అధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News September 13, 2025

పెనుకొండలో భార్యను హత్య చేసిన భర్త

image

పెనుకొండలో భార్యను భర్త హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. అల్తాఫ్ ఖాన్ తన భార్య సుమియా భాను(27)ను పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని గొడవపడేవాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్నుంచి పిల్లలతో పుట్టింటిలోనే ఉంటోంది. ఆగస్టు 26న పిల్లలను, ఆమెను తన గదికి తీసుకెళ్లి అల్తాఫ్ దారుణంగా కొట్టాడు. తీవ్రగాయాలైన సుమియాను కుటుంబీకులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరు తీసుకెళ్లగా శుక్రవారం మృతిచెందింది.

News September 13, 2025

ఈనెల 14న ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు: డీఆర్ఓ

image

UPSC ఆధ్వర్యంలో ఈనెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు జరుగుతాయని DRO మాలోలా తెలిపారు. రెండు కేంద్రాలలో 252 మంది అభ్యర్థులు హాజరవుతారు. UPSC నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. JNTU, KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.