News February 2, 2025
కాంగ్రెస్‌లోకి సంజయ్?.. క్లారిటీ ఇవ్వాలన్న బీజేపీ నేత

ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆ పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని బీజేపీ నేత నితీశ్ రాణే ఆరోపించారు. రాజ్యసభకు వెళ్లేందుకు శివసేన యూబీటీకి తగిన బలం లేకపోవడంతో కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు చెప్పారు. దీనిపై రౌత్ ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News March 15, 2025
షాకింగ్.. పెళ్లయిన వారిలోనే ఆ సమస్య ఎక్కువ

పెళ్లికి ముందుతో పోలిస్తే తర్వాతే మగవాళ్లు లావెక్కుతారని పొలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు తేల్చారు. మహిళల్లో ఇది 39 శాతమే ఉంటుందని చెప్పారు. సింగిల్స్‌తో పోలిస్తే పెళ్లయిన పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రెట్లు పెంచుతుందని అధ్యయనంలో తెలిపారు. తినే ఆహార పరిమాణం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కారణాలుగా అభిప్రాయపడ్డారు.
News March 15, 2025
బుమ్రా తెలివిగా ఆలోచించాలి: మెక్‌గ్రాత్

గాయాల విషయంలో భారత బౌలర్ బుమ్రా తెలివిగా వ్యవహరించాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మెక్‌గ్రాత్ సూచించారు. ‘తను యువకుడు కాదు. వయసు పెరిగే కొద్దీ ఫాస్ట్ బౌలర్లకు గాయాల ప్రమాదం మరింత ఎక్కువ. నేను తక్కువ వేగంతో బౌలింగ్ చేసేవాడిని కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్లు అప్రమత్తంగా ఉండాలి. జిమ్‌లో శరీరాన్ని దృఢపరచుకోవాలి. భారత్‌కు అతడి సేవలు అత్యవసరం’ అని పేర్కొన్నారు.
News March 15, 2025
సిRAW: భావోద్వేగాలే.. బాగోగుల్లేవిక్కడ

ఎన్నికలంటే ఐదేళ్ల ప్రోగ్రెస్ కార్డుతో ప్రచారాలుండాలి. ఇటీవల పాలకులు ప్రాంతం, జాతి, మతం, భాష అని ఎమోషనల్ కార్డు ప్లే చేస్తున్నారు. భావోద్వేగ డ్రామాతో పోల్ ఘట్టం గట్టెక్కేస్తున్నారు. ప్రశ్నించాల్సిన విపక్షాలూ కుర్చీ కోసం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అని పండగ సేల్‌లా ఆఫర్లిస్తున్నాయి. ప్రజల కోసం ఫలానా చేశామని చెప్పట్లేదు. ఎవరికి పవర్ వచ్చినా ప్రసాదం తినలేని ప్రజాస్వామ్య దేవుళ్లకే ఎగనామం. ఏమంటారు ఫ్రెండ్స్?