News March 19, 2024
కొన్న వస్తువు నచ్చకపోతే ఇలా చేయండి!
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అయితే, కొనుగోలు చేసిన వస్తువులు, వారు అందించిన సర్వీస్ పట్ల అసంతృప్తిగా ఉంటే ‘నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్’లో ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం 1800-11-4000, 1915 హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. 8800001915 నంబర్‌కు SMS చేసైనా మీ సమస్యను తెలపవచ్చు. ప్రభుత్వ <
Similar News
News December 29, 2024
ఫ్లైట్ 16 గంటల ఆలస్యం.. ప్రయాణికుల పడిగాపులు
ఇండిగో సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈరోజు ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళ్లాల్సిన ఆ సంస్థ విమానం 16 గంటలు ఆలస్యమై ఆ తర్వాత రద్దైంది. ముంబై ఎయిర్‌పోర్టులోనే పడిగాపులుగాసిన 100మంది ప్రయాణికులు ఇండిగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా.. తాము ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ చేసి వేరే ఫ్లైట్‌లో వారిని పంపించామని ఇండిగో వివరించింది.
News December 29, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 29, 2024
డిసెంబర్ 29: చరిత్రలో ఈరోజు
1844: భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఉమేశ్ చంద్ర బెనర్జీ జననం
1845: అమెరికాలో 28వ రాష్ట్రంగా టెక్సాస్ ఆవిర్భావం
1901: సినీ రచయిత పింగళి నాగేంద్రరావు జననం
1942: బాలీవుడ్ నటుడు రాజేశ్ ఖన్నా జననం
1953: రాష్ట్రాల పునర్విభజనకు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు
1965: తొలి స్వదేశీ యుద్ధట్యాంకు ‘విజయంత’ తయారీ
1974: నటి ట్వింకిల్ ఖన్నా జననం
2022: ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత