News February 2, 2025
భూపాలపల్లి: రేపు ప్రజావాణి రద్దు

భూపాలపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో సోమవారం నిర్వచించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు.
Similar News
News September 14, 2025
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు.!

పుత్తూరు కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 214 కేసులను పరిష్కరించినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. వివిధ కేసులలో ఉన్న 4979 మంది మధ్య రాజీ చేసి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర తెలిపారు. ఇందులో భాగంగా బలరామన్-రంజిత దంపతులను కలిపినట్లు ఆయన తెలిపారు.
News September 14, 2025
శ్రీకాకుళం డీఈఓగా రవిబాబు

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారిగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. DEO కార్యాలయంలో ADగా పనిచేస్తున్న రవిబాబును ఇప్పటివరకు ఇన్‌ఛార్జి DEOగా కొనసాగారు. జిల్లాలో విద్యా శాఖ అభివృద్ధికి అధికారుల సహాయంతో ముందడుగు వేస్తానని ఆయన అన్నారు.
News September 14, 2025
జగిత్యాలలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్

జగిత్యాల ఐఎంఏ హాల్లో గైనకాలజీ అసోసియేషన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ హేమంత్ ఈ సందర్భంగా పలువురు మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి మహిళ ఈ టీకా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య భద్రతకు ఈ టీకా ఎంతో ముఖ్యమని తెలిపారు.