News February 2, 2025

ఆండ్ర ఎస్ఐపై విచారణకు ఆదేశం

image

ఆండ్ర ఎస్ఐ సీతారాములు తీరుపై విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ విచారణకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులను ఆయన కలిసినట్లుగా వచ్చిన ఆరోపణలపై బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డిని విచారణ చేసి నివేదిక పంపాలని ఆదేశించామన్నారు. విచారణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.

Similar News

News November 6, 2025

రాజాం: పాము కాటుకు గురైన రైతులు

image

రాజాం మండలంలో పొలం పనులు కొనసాగుతుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విషకీటకాల బారినపడుతున్నారు. పాము కాటు బాధితుల్లో 90% మంది వీరే ఉంటున్నారు. మండలంలో అమరం గ్రామానికి చెందిన శంకర్రావు, సంకిలి గ్రామానికి చెందిన శివ, కింజంగి గ్రామానికి చెందిన శ్రీరాము, పెంట గ్రామానికి చెందిన ఆదినారాయణ వరికోతలు చేస్తుండగా బుధవారం పాము కాటుకు గురయ్యారు. వీరు రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News November 6, 2025

ఆర్డీవోలు తహశీల్దార్లతో సమీక్షించాలి: VZM కలెక్టర్

image

రెవెన్యూ సేవల కోసం అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ వినతులు ఉంటే సహించేది లేదన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, OBC, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు వంటి సేవలు నిర్దేశిత గడువు దాటకుండా పూర్తవ్వాలని, ఆర్‌డీవోలు రోజువారీగా తహశీల్దార్లతో సమీక్షించాలన్నారు.

News November 5, 2025

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగాలి: JC

image

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షలో జేసీ మాట్లాడారు. ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా ఆర్డీవోలు, తహశీల్దార్లు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తదుపరి మండల, గ్రామ స్థాయిలో కూడా వెంటనే శిక్షణ జరపాలని ఆదేశించారు.