News February 2, 2025
పుచ్చలపల్లి ఊరిలో CPM అగ్ర నేత పర్యటన

కమ్యూనిస్టు పోరాట యోధుల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య స్వగ్రామం విడవలూరు(M) అలగానిపాడులో CPM పొలిట్ బ్యూరో సభ్యులు బేబీ పర్యటించారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య నివాసంలో ఉన్న ఆనాటి పుస్తకాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తాను నెల్లూరులో జరుగుతున్న మహాసభలకు వచ్చానని, సుందరయ్య స్వగ్రామం చూడాలన్న కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News March 12, 2025
స్వచ్ఛ ఆంధ్రలో అందరినీ భాగస్వాములు చేయండి: కలెక్టర్

ప్రతి మూడవ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో అందర్నీ భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుంచి పదవ తరగతి పరీక్షలు, స్వచ్ఛ ఆంధ్ర, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రజల సంతృప్తి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
News March 12, 2025
నెల్లూరు: ‘ప్లాన్ తయారు చెయ్యడంలో శ్రద్ధ తీసుకోండి’

నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర – 2047 ప్రణాళిక తయారు చేయడంలో నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వర్ణాంధ్ర – 2047 యాక్షన్ ప్లాన్‌ను నియోజకవర్గ స్థాయిలో తయారు చేసేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. GDDPపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు పాల్గొన్నారు.
News March 12, 2025
నెల్లూరు: ANMల కౌన్సెలింగ్ వాయిదా

నెల్లూరు జిల్లాలో సచివాలయం ఏఎన్ఎంలు (గ్రేడ్-3)గా పనిచేస్తున్న 289 మందికి ఎంపీహెచ్ఏ(ఎఫ్)గా ఇటీవల ఉద్యోగోన్నతి కల్పించారు. వీరికి సబ్ సెంటర్ల కేటాయింపునకు సంబంధించి మార్చి 13న నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. 17న నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర తెలిపారు. సీనియారిటీ సమస్యలు ఉత్పన్నం కాకుండా జోన్ పరిధిలోని జిల్లాల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నామన్నారు.