News March 19, 2024

వెంకటగిరి: వరకట్న వేధింపు కేసులో ఉపాధ్యాయునికి మూడేళ్ల జైలు

image

ప్రభుత్వ ఉపాధ్యాయుడైన చెవిరెడ్డి సుధాకర్ రెడ్డి 2011లో స్వప్నను పెళ్లి చేసుకున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని 2017లో ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారించిన వెంకటగిరి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించినట్లు ఏపీపీ ప్రకృతి కుమార్ తెలిపారు.

Similar News

News January 8, 2026

నెల్లూరు రూపు రేఖలు మారేనా..?

image

నెల్లూరులో త్వరలో 84KM మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. NH-16, బుచ్చి హైవే, మినీబైపాస్ రోడ్డు, పొదలకూరు రోడ్డు, ముత్తుకూరు రోడ్డు తదితర ప్రాంతాలు అనుసంధానం కానున్నాయి. ట్రాఫిక్ సమస్య తీరనుంది. కృష్ణపట్నం పోర్టుతో పాటు పలు పరిశ్రమలకు భారీ వాహనాల రాకపోకలు సులభంగా జరగనున్నాయి. దూరాభారాలు తగ్గనున్నాయి. లేబూరు బిట్-2 నుంచి రాజుపాలెం వరకు రింగ్ రోడ్డు రానుండగా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది.

News January 8, 2026

శకటాలను అందంగా తయారుచేయండి: జేసీ

image

నెల్లూరులో రిప్లబిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల పరిశుభ్రతతో పాటు భద్రతకు ప్రాధాన్యమివ్వాలని పోలీస్ శాఖకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా, విజ్ఞానదాయకంగా తయారుచేసి ప్రదర్శించాలని కోరారు.

News January 8, 2026

కాకాణి.. ఇప్పుడు మాట్లాడు: సోమిరెడ్డి

image

కండలేరు స్పిల్ వే నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల కావడంపై సోమిరెడ్డి స్పందించారు. ‘అయ్యా.. కాకాణి గారు.. కండలేరు స్పీల్ వేపై ఇప్పుడు మాట్లాడు. గతంలో జంగిల్ క్లియరెన్స్ జరగలేదని, 100క్యూసెక్కులు కూడా ప్రవాహం ఉండదని నోరు పారేసుకున్నావు. ఇప్పుడు 500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నువ్వు వెళ్లి చూడు. జంగిల్ క్లియరెన్స్ జరిగిందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పవయ్యా’ అని సోమిరెడ్డి సవాల్ చేశారు.