News February 2, 2025
జనగామ: రేపటి ప్రజావాణి రద్దు

జనగామ కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు.
Similar News
News March 12, 2025
పల్నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

స్థానిక పల్నాడు కలెక్టరేట్ వద్దకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. యువత పోరులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
News March 12, 2025
వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో కడప జిల్లా ఎమ్మెల్సీలు

తాడేపల్లెలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అధినేత జగన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ లక్ష్యాలను ఆయన వివరించారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీ పెట్టినట్లు చెప్పారు. వైసీపీ వెన్నంటే నిలిచిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఎమ్మెల్సీలు రమేశ్ యాదవ్, రామ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.