News February 2, 2025
త్రిష తెలంగాణకు గర్వకారణం: రేవంత్
TG: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ప్లేయర్లు తెలంగాణకు గర్వకారణమని అన్నారు. మరింతగా రాణించి సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. నైపుణ్యమున్న ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
చరిత్ర సృష్టించిన రసెల్
వెస్టిండీస్ ప్లేయర్ రసెల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆయన కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్(5,915 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా 9వేల పరుగులు పూర్తి చేసిన 25వ ప్లేయర్ రసెల్ కావడం గమనార్హం. 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశారు.
News February 3, 2025
IIFA అవార్డ్స్.. నామినేషన్లు ఈ చిత్రాలకే
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA)-2025కు హిందీ నుంచి నామినేషన్ల జాబితా విడుదలైంది. కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ ఏకంగా 9 విభాగాల్లో పోటీ పడుతోంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రి, విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్య-3 ఏడు, స్త్రీ-2 ఆరు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. జైపూర్ వేదికగా IIFA సిల్వర్ జూబ్లీ వేడుక మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది.
News February 3, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఎప్పుడుదప్పులు వెదకెడు
నప్పురుషునిగొల్వగూడదదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
తాత్పర్యం: నల్లతాచు నీడలో నివసించే కప్ప బతుకు ఎంత అస్థిరంగా ఉంటుందో ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పనిచేసే వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది.