News February 2, 2025

పంచాయతీ ఎన్నికలపై కీలక ప్రకటన

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15లోపే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా కులగణనపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందగా, ఈ నెల 4న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Similar News

News February 3, 2025

చరిత్ర సృష్టించిన రసెల్

image

వెస్టిండీస్ ప్లేయర్ రసెల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆయన కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్(5,915 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా 9వేల పరుగులు పూర్తి చేసిన 25వ ప్లేయర్ రసెల్ కావడం గమనార్హం. 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశారు.

News February 3, 2025

IIFA అవార్డ్స్.. నామినేషన్లు ఈ చిత్రాలకే

image

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA)-2025కు హిందీ నుంచి నామినేషన్ల జాబితా విడుదలైంది. కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ ఏకంగా 9 విభాగాల్లో పోటీ పడుతోంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రి, విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్య-3 ఏడు, స్త్రీ-2 ఆరు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. జైపూర్ వేదికగా IIFA సిల్వర్ జూబ్లీ వేడుక మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది.

News February 3, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఎప్పుడుదప్పులు వెదకెడు
నప్పురుషునిగొల్వగూడదదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
తాత్పర్యం: నల్లతాచు నీడలో నివసించే కప్ప బతుకు ఎంత అస్థిరంగా ఉంటుందో ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పనిచేసే వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది.