News February 2, 2025

హుజురాబాద్: చెరువు కుంటలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు స్నేహితులతో కలిసి చెరువు కుంటలో ఈతకు వెళ్లి వెంకట సాయి అనే 6వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. వెంకటసాయి మృతి చెందడంతో కందుగుల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 16, 2026

పాలమూరు: నేడే పరీక్ష ఫీజుకు లాస్ట్ డేట్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరిన విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈ నెల 16లోగా (ఫైన్‌తో) ఎగ్జామ్ ఫీ ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు. #SHARE IT

News January 16, 2026

కాగజ్‌నగర్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌కు గ్రీన్ సిగ్నల్

image

సిర్పూర్ కాగజ్ నగర్ వాసులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. న్యూ ఢిల్లీ – తిరువనంతపురం కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు కాగజ్ నగర్‌లో హాల్ట్ కల్పించనున్నారు. దీనివల్ల శబరిమల అయ్యప్ప భక్తులకు, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది. చిరకాలంగా ఎదురుచూస్తున్న రైలు నిలుపుదలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.