News February 3, 2025

విఫలమవుతున్నా సంజూకి ఛాన్సులివ్వాలి: మంజ్రేకర్

image

సంజూ శాంసన్ వరసగా విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి ఎక్కువ అవకాశాలిస్తూ ఉండాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘టీ20ల్లో పరుగులెన్ని చేశారని కాకుండా ఆటగాడు ఎలాంటి ప్రభావం చూపిస్తాడో అంచనా వేయాలి. సంజూ వంటి బ్యాటర్ క్రీజులో ఉంటే మ్యాచ్ గతినే మార్చేయగలరు. ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించగలరు. ఒక్కోసారి వైఫల్యాలు వస్తాయి. అయినప్పటికీ ఓపిగ్గా ఛాన్సులిచ్చి అండగా నిలవాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News February 3, 2025

అభిషేక్ హిట్టింగ్.. నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్: బట్లర్

image

చివరి టీ20లో 135 పరుగులతో చెలరేగిన అభిషేక్ శర్మపై ఇంగ్లండ్‌ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించారు. తాను ఇప్పటి వరకు ఎంతో క్రికెట్ చూశానని, అయితే అభిషేక్ హిట్టింగ్ తాను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ అని వెల్లడించారు. హోం సిరీస్‌లలో భారత్ అద్భుతమైన జట్టు అని చెప్పారు. సిరీస్ కోల్పోవడం బాధగా ఉందన్నారు. వన్డేల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

News February 3, 2025

15న పార్లమెంటులో ‘రామాయణం’ ప్రదర్శన

image

‘రామాయణం: ది లెజెండ్‌ ఆఫ్ ప్రిన్స్ రామ’ యానిమేటెడ్ చిత్రాన్ని ఈ నెల 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నట్లు గీక్ పిక్చర్స్ వెల్లడించింది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపింది. 1993లో ఈ సినిమాను ఇండో-జపనీస్ టీమ్ తెరకెక్కించింది. 24వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియాలో ప్రదర్శించారు. రచయిత విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి రైటర్‌గా పనిచేశారు.

News February 3, 2025

గిరిజన శాఖను బ్రాహ్మణుడు/నాయుడికి ఇవ్వాలి: సురేశ్ గోపి

image

గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘గిరిజన కులాలకు చెందిన వ్యక్తే ఆ శాఖ మంత్రి అవుతున్నారు. ఇది దేశానికి శాపం. బ్రాహ్మణుడు/నాయుడు ఆ శాఖ బాధ్యతలు చేపడితే మార్పు ఉంటుంది’ అని పేర్కొన్నారు. కులాలపై కామెంట్లు చేసిన ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కేరళ నేతలు డిమాండ్ చేస్తున్నారు.