News February 3, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలపై  డీఆర్వో సమీక్ష

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్‌ను రాజకీయ పార్టీలు తప్పక పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. భీమవరం కలెక్టరేట్‌లో డిఆర్ఓ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై తూర్పు, ప. గో.జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, మోడల్ కోడ్ గురించి వివరించారు. జిల్లాలో 69,884 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్నారన్నారు.

Similar News

News March 19, 2026

తణుకు: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

image

తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్‌ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్‌ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

News March 19, 2026

భీమవరం: ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

image

భీమవరంలోని కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈమని సోమయాజులు ఘనాపాటి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, మహా ఆశీర్వచనం, కవి సమ్మేళనం ఉంటాయని పేర్కొన్నారు. ఇదే వేదికపై ప్రముఖ కవులు తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, డాక్టర్ గొర్తి వెంకట సుబ్రహ్మణ్యం శర్మ, డాక్టర్ పెంకి విజయ్ కుమార్లను ఘనంగా సత్కరించనున్నట్లు ఆమె వెల్లడించారు.