News February 3, 2025

KMR: జిల్లా వాసికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు

image

కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు డా. బాలుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం గతేడాది కామారెడ్డి జిల్లాలో 22 రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. భారతదేశంలోనే మొట్ట మొదటి సంస్థగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు దక్కించుకున్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డా.బాలు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 18, 2025

ఇచ్చోడ: పోలీసులపై దాడి.. ప్రధాన నిందితుడి అరెస్ట్

image

కేశవపట్నంలో ఫారెస్ట్ అధికారులు, పోలీసులపై దాడి చేసిన ప్రధాన నిందితుడు షేక్ అల్తాఫ్ అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

News September 18, 2025

మంచిర్యాలలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మంచిర్యాల పట్టణంలోని సూర్య నగర్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు ఏసీపీ ప్రకాశ్ ఆదేశాలతో సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐ తిరుపతి గురువారం సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఓ ఇంట్లో బాదే రాజమణి, సమీల రాకేశ్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని, వారితోపాటు విటులు కొండ విజయ్, కావేటి సురేశ్‌ను అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News September 18, 2025

చిమ్మిరిబండలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

మార్టూరు మండలం చిమ్మిరిబండ గ్రామంలో గురువారం పిడుగుపాటుకు గురై దుడ్డు కొర్నేలు వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆయన పొలంలో పనిచేస్తుండగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో అతనిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పశు కాపర్లు గమనించి VROకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మృతుడి వివరాలు సేకరించి మార్టూరు తహశీల్దార్ ప్రశాంతికి నివేదిక అందించారు.