News February 3, 2025
బాపట్ల: PGRS కార్యక్రమం రద్దు

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News January 3, 2026
ఇవాళ సూపర్ మూన్.. ఎన్ని గంటలకంటే?

ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు. ఆ సమయంలో ఎర్త్‌కు 3.6 లక్షల KM దూరంలో చందమామ ఉంటాడట. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం, అదే టైమ్‌లో సూర్యుడికి భూమి దగ్గరగా ఉండటం, సూర్యుడికి చంద్రుడు పూర్తి ఎదురుగా రావడంతో సూపర్ మూన్ వెలిగిపోనుంది.
News January 3, 2026
కొడుకు, కోడలు క్యూట్ ఫొటో షేర్ చేసిన ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ కొడుకు రైహాన్ త్వరలో <<18710916>>పెళ్లి<<>> చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడుకు, కాబోయే కోడలు క్యూట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. వారిద్దరూ మూడేళ్ల వయసు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘మీ ఇద్దరినీ ఎంతో ప్రేమిస్తున్నా. ఎల్లప్పుడూ ఒకరినొకరూ ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండండి. మూడేళ్ల వయసు నుంచీ ఉన్నట్లే ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగండి ’ అని రాసుకొచ్చారు.
News January 3, 2026
HNK:అవమానం భరించలేక యువకుడి సూసైడ్

అవమానం భరించలేని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పరమేశ్వర్ కథనం ప్రకారం.. HNK జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లికి చెందిన మేకల బన్నీ(19) తన అక్క భర్త గణేష్, మామ, వారి బంధువు భాస్కర్ దుర్భాషలాడి దాడి చేయడంతో అవమానం భరించలేకపోయాడు. ఈ క్రమంలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు అయింది.


