News February 3, 2025
కల్వకుర్తిలో అథ్లెటిక్స్ ఎంపికలకు ఏర్పాట్లు పూర్తి

కల్వకుర్తిలోని బాలుర ఉన్నత పాఠశాలలో నేడు జరిగే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన సూచించారు. ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సోల పోగుల స్వాములు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
కన్నుల పండువగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శనివారం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం వేడుక ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళ తాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి బేడా మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణ ధారణ, యౌక్త్రధారణ గావించి నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు.
News January 17, 2026
వరంగల్: జోన్ల వారీగా పోలీస్ స్టేషన్ల వివరాలు! 2/2

(NSPT ACP) చెన్నావుపేట, నెక్కొండ, నెక్కొండ సర్కిల్, ఖానాపూర్,
(మామూనూర్ ACP) మామూనూర్, పర్వతగిరి, పర్వతగిరి సర్కిల్, ఐనవోలు, గీసుగొండ,సంగెం, ఎనుమాముల
వెస్ట్ జోన్-ASP- జనగామ, నర్మెట్ట సర్కిల్, నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట
(స్టే.ఘ.ACP) ఘన్పూర్, రఘునాథపల్లి సర్కిల్, చిల్పూర్, రఘునాథపల్లి, లిం.ఘ.
(వర్ధన్నపేట), వర్ధన్నపేట సర్కిల్, వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్ గడ్, పాలకుర్తి, కొడకండ్ల,దేవరుప్పుల
News January 17, 2026
వరంగల్: జోన్ల వారీగా పోలీస్ స్టేషన్ల వివరాలు! 1/2

సెంట్రల్ జోన్: (వరంగల్ ఏసీపీ) మట్టెవాడ, ఇంతేజార్ గంజ్, మీల్స్ కాలనీ,
(హన్మకొండ ఏసీపీ)హన్మకొండ, సుబేదారి, కేయూసీ,
(కాజీపేట ఏసీపీ) కాజీపేట, హసన్‌పర్తి, కమలాపూర్, ఎల్కతుర్తి, ఎల్కతుర్తి సర్కిల్, వంగర, ముల్కనూర్, వేలేరు, ధర్మసాగర్, మడికొండ
ఈస్ట్ జోన్: (ఏసీపీ పరకాల) పరకాల, శాయంపేట, శాయంపేట సర్కిల్, ఆత్మకూర్, దామెర
(నర్సంపేట ఏసీపీ) నర్సంపేట, దుగ్గొంది, దుగ్గొండి సర్కిల్, నల్లబెల్లి


