News March 19, 2024

కలుషిత రాజధానుల్లో అగ్రస్థానానికి మళ్లీ ఢిల్లీ!

image

ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానుల జాబితాలో ఢిల్లీ మళ్లీ అగ్రస్థానానికి చేరింది. స్విస్ సంస్థ IQAIR విడుదల చేసిన ప్రపంచ వాయు నాణ్యత సూచీలో పాకిస్థాన్‌లోని లాహోర్ గత ఏడాది టాప్‌లో ఉండగా, ఇప్పుడు ఢిల్లీ ఆ స్థానానికి చేరింది. అత్యంత కలుషిత దేశాల్లో భారత్ గత ఏడాది 8వ స్థానంలో ఉండగా, ఈసారి 3వ ప్లేస్‌లో నిలిచింది. అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతం జాబితాలో బిహార్‌లోని బెగుసరాయ్ అగ్రస్థానంలో ఉంది.

Similar News

News July 8, 2024

భూమన, ధర్మారెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు

image

AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీఎస్ నీరభ్ కుమార్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అక్రమాలు చేశారని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే వ్యాపారవేత్తలతో ధర్మారెడ్డి వైసీపీకి విరాళాలు ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సీఐడీ, విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించాలని కోరారు.

News July 8, 2024

YELLOW ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News July 8, 2024

‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు

image

TG: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. దీనిని గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ESCIలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం పారిశ్రామిక ప్రముఖులతో CM చర్చలు జరిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా వర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు.