News February 3, 2025

కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

image

మచిలీపట్నం-పెడన హైవేలో హర్ష కాలేజ్ సమీపంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం ప్రమాదం తప్పింది. కారుకు బైక్ అడ్డుగా రావడంతో తప్పించే క్రమంలో అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News March 7, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
* కృష్ణ యూనివర్సిటీ డిగ్రీ 3,4 సెమిస్టర్ రీవాల్యూషన్ ఫలితాలు విడుదల
* ఉయ్యూరులో విద్యార్థుల మెడలో చెప్పుల దండ
* విజయవాడలో పోలీసులపై కాల్పులకు యత్నం.!
* కృష్ణాజిల్లాలో అంగన్వాడీ పోస్ట్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడలో మూడు నెలలపాటు ఉచిత వెబ్ డెవలపర్ శిక్షణ
* మొవ్వ: బావిలో పడి మహిళా కూలి మృతి

News March 6, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* నాగాయలంక: 18 నెలల పసికందును కాటేసిన పాము
వీరవల్లి: ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి ఘటనలో విద్యార్థులకు కౌన్సెలింగ్
* విజయవాడ: OLX పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
* విజయవాడలో బైక్ స్టంట్స్ చేస్తున్న యువకులకు కౌన్సెలింగ్
* విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కుంబాభిషేకం
* అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే

News March 6, 2026

కృష్ణా: గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండో పంటైన అపరాల సాగు కోత పనులు ఊపందుకున్నాయి. అయితే అపరాల సాగు ప్రారంభ దశలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక తెగుళ్లు వ్యాపించి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అపరాలు విక్రయాలు చేద్దామన్న మద్దతు ధర లేక రైతులు సిండికేట్‌గా మారిన దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.